Share News

గిరిబాబు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 14 , 2026 | 08:51 PM

ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

గిరిబాబు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

అమరావతి, నవంబరు 14: ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిబాబు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గిరిబాబు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అందించిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. నటుడిగా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. గిరిబాబు మంచి నటుడే కాకుండా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అని ప్రశంసించారు.


ప్రకాశం జిల్లాలోని ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 600లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని, గిరిబాబు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 14 , 2026 | 09:33 PM