Share News

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

ABN , Publish Date - Nov 14 , 2026 | 08:49 AM

అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దేశంలోని విమానాశ్రయాల నుంచి విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..
US Flights Grounded

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో విమాన ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఎదురైంది. దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దేశంలోని విమానాశ్రయాల నుంచి విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామంతో వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి. పలు విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు (US Flights Grounded).


అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలను ప్రభావితం చేసే కమ్యూనికేషన్ సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని అమెరికా విమానాశ్రయాల్లో విమానాల టేకాఫ్‌లపై తాత్కాలిక నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను పర్యవేక్షించే 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలపై ఈ సమస్య ప్రభావం చూపింది. ఎఫ్ఏఏ సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు (FAA Flight Shutdown).


ఈ అంతరాయం కారణంగా నేలపై ఉన్న విమానాల టేకాఫ్‌లను నిలిపివేశారు (US Flight Cancellations). అయితే అప్పటికే గాల్లో ఉన్న విమానాలు మాత్రం తమ ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతించారు. కాగా, సుమారు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ నిషేధాన్ని ఎఫ్ఏఏ శుక్రవారం రాత్రి ఎత్తివేసింది. దీంతో విమానాలు బయలుదేరేందుకు మళ్లీ అనుమతులు ఇచ్చారు. అయినప్పటికీ విమానాలు, సిబ్బంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో సేవలు సాధారణ స్థితికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..


పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 14 , 2026 | 08:55 AM