నిలకడగా రాప్తాడు నిందితుడి ఆరోగ్యం.. వెల్లడించిన వైద్యులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:34 PM
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్‌లో పదోతరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్యపరిస్థితిపై తాజా సమాచారాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వేంకటేశ్వర్లు వెల్లడించారు.
అనంతపురం, నవంబర్ 14: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాప్తాడు బాలిక కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వేంకటేశ్వర్లు వెల్లడించారు.
రాప్తాడు హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. హేమంత్‌కు ఆయాసం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తగ్గిందన్నారు. నిందితుడికి 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించినట్లు సూపరింటెండెంట్ డా. వేంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. పోలీసుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడి.. కుడి కాలును వైద్యులు శస్త్ర చికిత్స తొలగించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్