జగన్ బెంగుళూరులో కూర్చుని.. ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:51 PM
జగన్ బెంగుళూరులో కూర్చుని ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా.. చూస్తూ కూర్చోనని హెచ్చరించారు. నేడు(బుధవారం)జరిగిన కాబినెట్ భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 23: జగన్ బెంగుళూరులో కూర్చుని ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాాబు నాయుడు ఆరోపించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిమోట్‌తో కంట్రోల్ చేసినట్లుగా జగన్ బెంగుళూరు నుంచి తమ రౌడీ గ్యాంగ్స్‌ను ఆపరేట్ చేస్తూ.. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
రాజకీయ నాయకుల ముసుగులో వైసీపీ రౌడీ మూకలు, అసాంఘిక శక్తులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా.. ఎంతటి వారైనా.. చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే రాష్ట్రంలో కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేస్తామని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
అనంతరం రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికలు దశల వారీగా జరుగుతాయని.. ఈ మేరకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రులకు ఆయన పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని.. కూటమి సమన్వయ బాధ్యత కూడా మంత్రులపైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై నిఘా పెట్టాలని.. అందుకోసం ప్రత్యేకంగా మానిటర్ మెకానిజంను రూపొందించుకోవాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
మొదటి విడతగా 24 వేల మంది పేదలకు పట్టాల పంపిణీ: ఎంపీ కేశినేని చిన్ని
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News