Share News

మొదటి విడతగా 24 వేల మంది పేదలకు పట్టాల పంపిణీ: ఎంపీ కేశినేని చిన్ని

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:46 PM

ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం ద్వారా పట్టాలు మంజూరు చేస్తున్నామని విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. 24,042 మంది పేదవారిని గుర్తించామన్నారు.

మొదటి విడతగా 24 వేల మంది పేదలకు పట్టాల పంపిణీ: ఎంపీ కేశినేని చిన్ని
Vijayawada MP Kesineni Chinni

విజయవాడ, సెప్టెంబర్ 23: ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం ద్వారా పట్టాలు మంజూరు చేస్తున్నామని విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. 24,042 మంది పేదవారిని గుర్తించామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో ఈ పట్టాలను పేదలకు అందిస్తామని పేర్కొన్నారు. విజయవాడ వాసులకు దసరా, దీపావళి పండగ ముందే వస్తుందని అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్ల రూపాయల స్థలాన్ని పేదలకు పట్టాల రూపంలో అందిస్తున్నామని చెప్పారు.


మొదటి విడతగా 24 వేల మందికి పట్టాలు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు అందరిని పిలుస్తామని తెలిపారు. ఇంకా కొందరు లబ్ధిదారులు ఉన్నారని.. వారికి సెకండ్ ఫేజ్‌లో పట్టాలు అందిస్తామని ప్రకటించారు. 24 వేల కుటుంబాలకు లక్ష కోట్ల రూపాయిల అస్తి పట్టాల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.


సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే గద్దె

పేదలకు పట్టాభిషేకం అనేది మంచి కార్యక్రమమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభివర్ణించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా తాము కంటున్న కల ఇదని తెలిపారు. దీనిపై జిల్లా సమావేశాల్లో చర్చించామని చెప్పారు. అధికారులంతా కృషి చేసి పట్టాలు ఇవ్వడంలో సహకరించారని పేర్కొన్నారు. జాటిలమైన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


పేదలకు పట్టాలపై సానుకూలంగా స్పందించిన సీఎం: జిల్లా కలెక్టర్

అర్హులైన పేదలందరికి పట్టాలను అందజేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ పట్టాల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వివరించారు. అర్హులైన ఏ ఒక్కరినీ వదలకుండా పరిశీలన చేసిన పట్టాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో పెట్టి ఆమోదింప చేసుకొని పట్టాలు ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు.


ఇవి కూడా చదవండి..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

బీజేపీలో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 05:01 PM