భూమిపేరుతో ఎమ్మెల్సీనే మోసం చేసిన కేటుగాళ్లు
ABN , Publish Date - Oct 10 , 2026 | 10:36 AM
రాష్ట్రంలో మోసగాళ్లు చెలరేగుతున్నారు. ఏకంగా ఏపీ ఎమ్మెల్సీనే మోసం చేసి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
అమరావతి, అక్టోబర్ 10: రాష్ట్రంలో కేటుగాళ్లు ముదిరిపోయారు. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరినీ మోసం చేస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారు. తక్కువ ధరలో ల్యాండ్ అమ్ముతామంటూ ఏకంగా ఏపీ ఎమ్మెల్సీకే టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌లో ఐదెకరాల స్థలం తమదేనని.. తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యను సంప్రదించారు. నిజమని నమ్మిన ఎమ్మెల్సీ స్థలాన్ని కొనడానికి అంగీకరించారు. అడ్వాన్స్‌గా రూ. 25 లక్షలను కోరగా.. రామచంద్రయ్య డబ్బులు చెల్లించారు. ల్యాండ్ పత్రాలు చూపించాలని కొన్ని రోజుల తర్వాత ఎమ్మల్సీ ఆ దుండగులను కోరగా.. వారు ముఖం చాటేశారు. అనుమానం వచ్చిన ఆయన ల్యాండ్ గురించి ఆరా తీశారు. మాదాపూర్‌లో ఐదెకరాల స్థలం ఉన్నమాట వాస్తవమే గాని.. ఆ స్థలానికి దుండగులకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుని కంగుతిన్నారు. మోసం పోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
తూ.గో. జిల్లాలో పెద్దపులి సంచారం.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిక
కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా
Read Latest Telangana News And Telugu News