చంద్రబాబు హయాంలోనే మైనారిటీల సంక్షేమం సాధ్యం: ఎమ్మెల్యే మహ్మద్ నసీర్
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:23 PM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముస్లిం మత పెద్దల గౌరవవేతనానికి సంబంధించిన 3 నెలల నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది.
అమరావతి, అక్టోబర్ 15: రాష్ట్రంలో మైనారిటీ మత పెద్దల సంక్షేమం కోసం గౌరవ వేతనంగా ప్రభుత్వం రూ.22.50 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు జులై నుంచి సెప్టెంబర్ వరకు త్రైమాసిక వేతనాలను ఒకేసారి విడుదల చేసినట్లు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలు కానున్న నేపథ్యంలో నిధులు అందించడంలో జాప్యం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు గుంటూరు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. మైనారిటీలకు విద్య, ఉపాధి, సంక్షేమం సీఎం చంద్రబాబు పాలనలోనే సాధ్యమని ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. కూటమి పాలనలోనే మైనారిటీలకు భరోసా లభిస్తోందన్నారు.
‘జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత పెద్దలు వేధింపులకు గురైతే.. కూటమి ప్రభుత్వంలో వారికి సముచిత గౌరవం లభిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అరకొర నిధులతో ముస్లిం మత పెద్దలకు మొండిచేయి చూపించింది. కూటమి ప్రభుత్వం 27 నెలల్లోనే మత పెద్దల గౌరవ వేతనంగా రూ. 202 కోట్లను విడుదల చేసింది. మైనారిటీల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోంది. వైసీపీ పాలనలో రద్దయిన పథకాలను తిరిగి పునరుద్ధరించి.. ఆర్థిక స్వావలంబన చేకూర్చుతున్నాం. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. వైసీపీ నాయకుల కబ్జాల్లోకి వెళ్లిన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లిం సంక్షేమం కోసం వినియోగిస్తున్నాం’ అని ఎమ్మెల్యే అహ్మద్ పేర్కొన్నారు
ఈ వార్తలు కూడా చదవండి
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News