Share News

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి సత్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Oct 18 , 2026 | 02:58 PM

వైసీపీ హయాంలో తిరోగమనం చెందిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు మోదీ సహకారంతో మళ్లీ పురోగమనంలోకి తెచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అజేష్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి సత్యకుమార్ యాదవ్
ap minister sathyakumar on local elections

అమరావతి, అక్టోబర్ 18: స్థానిక ఎన్నికల నామినేషన్ నేపథ్యంలో వైసీపీ అల్లర్లు సృష్టించడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని.. అందుకే ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడిగే ధైర్యం లేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న వైసీపీ.. నీతి మాటలు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.


‘కూటమి హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో పట్టణాభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చింది. 16వ ఆర్థిక సంఘం నాలుగున్నర లక్షల కోట్ల నిధులను ఏపీకి కేటాయించింది. కేంద్రం, రాష్ట్రం, స్థానికంగా ‍ఒకే ప్రభుత్వం ఉంటేనే నిధులు బాగా వస్తాయి. అదే వేరే వారు ఇక్కడ గెలిస్తే.. నిధులు వచ్చే అవకాశం ఉండదు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ కూటమి అభ్యర్థులనే గెలిపించండి. గ్లాస్, సైకిల్, కమలం.. ఇలా గుర్తులు వేరైనా ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే పనిచేస్తాయి. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యం’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలూ చదవండి

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు.. పుంగనూరుకు రావొద్దని ఆదేశం

విజయనగరంలో ఎవరికి వారే!

Updated Date - Oct 18 , 2026 | 03:27 PM