విజయనగరంలో ఎవరికి వారే!
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:55 AM
విజయనగరం నగరపాలక సంస్థ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో సీట్ల కేటాయింపుపై జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నారు. గెలుపు అవకాశాలు లేని స్థానాలను తమకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ, జనసేన నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
బీ-ఫాం లేకుండానే జనసేన నేతల నామినేషన్లు
విజయనగరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో సీట్ల కేటాయింపుపై జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నారు. గెలుపు అవకాశాలు లేని స్థానాలను తమకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి వరకూ టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చలు కొనసాగాయి. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన జనసేన నాయకులతో పలుమార్లు చర్చించినా ఫలితం కనిపించలేదు. ఏకాభిప్రాయం కుదరలేదు. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో జనసేన నేతలు సొంతగా నామినేషన్లు దాఖలు చేశారు.
బీ-ఫాం లేకపోయినా స్నేహపూర్వక పోటీకి సిద్ధమవుతూ ఆ పార్టీ నాయకుడు గురాన అయ్యలు సతీమణి గురాన రాధిక విజయనగరం మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అదేవిధంగా 12 డివిజన్లలో జనసేన అభ్యర్థులు కార్పొరేటర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లిమర్ల నగర పంచాయతీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు, జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు పోటీగా పెద్దసంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ