రాయలసీమలోకి బిహార్ సంస్కృతిని తెచ్చిన వైసీపీ: మంత్రి మండిపల్లి
ABN , Publish Date - Oct 17 , 2026 | 08:57 PM
వైసీపీ నేతలు అహింసను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అరాచక రాజకీయాలకు తెరలేపారని మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి,అక్టోబర్ 17: వైసీపీ నేతలు అహింసను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అరాచక రాజకీయాలకు తెరలేపారని మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుంగనూరు, రాయచోటిలో ఇటీవల జరిగిన ఘర్షణలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డే ప్రధాన కారణమని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి కిరాయి గూండాలను రప్పించి స్థానికంగా దాడులు చేయిస్తున్నారని, బిహార్ సంస్కృతిని రాయలసీమలోకి తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు.
పుంగనూరు, రాయచోటిలో పోలీసులు పట్టుకున్న కిరాయి హంతకుల నుంచి భారీ ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి తెలిపారు. పోలీసుల దర్యాప్తులో అనేక భయానక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ ముఠాలు ఎవరి కోసం ఇక్కడ రెక్కీ నిర్వహించాయి? గత మూడు రోజులుగా ఈ కిరాయి ముఠాలు చేసిన ఆపరేషన్ ఏమిటనే కోణంలో లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు