ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్కు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్
ABN , Publish Date - Oct 17 , 2026 | 08:19 PM
ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్కు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ దాఖలు చేశారు.
Atmakur municipal chairman nomination: నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ సమరంలో తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు ఉత్సాహంతో ముందుకుసాగుతున్నాయి. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో టీడీపీ క్యాడర్లోవిశేష స్పందన కనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా ఆత్మకూరు పట్టణంలో డాక్టర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ గోవిందరాజులు ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన అందించిన వైద్యాసేవలు, మృదుస్వభావం అభ్యర్థిత్వానికి ప్లస్ పాయింట్గా మారాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆత్మకూరు పట్టణంలో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు కీలకం. డాక్టర్ గోవిందరాజులకు మైనార్టీల నుంచి లభిస్తున్న విశేష ఆదరణ, మద్దతు తమను గెలుపు తీరానికి చేర్చుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. స్థానిక నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమ గెలుపును సుగమం చేస్తాయని టీడీపీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News