శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:34 PM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు మంత్రి.
ఇంటర్‌నెట్ డెస్క్: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు మంత్రి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రికి ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా చూడాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేట్ టెండర్లతో సంస్థ మనుగడకు ముప్పు: ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు