కోర్టు విచారణల లైవ్, రికార్డింగ్‌పై నిషేధం.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:32 PM
న్యాయస్థాన విచారణల అనధికార రికార్డింగ్, ప్రసారాలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ విచారణలకు సంబంధించిన లైవ్, అప్‌లోడ్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, నవంబరు 25: న్యాయస్థాన విచారణల అనధికార రికార్డింగ్, ప్రసారాలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ విచారణలకు సంబంధించిన లైవ్, అప్‌లోడ్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థాన గౌరవం, పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు.
ప్రత్యక్షంగా జరిగే విచారణలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ విచారణల రికార్డింగ్‌కూ అనుమతి తప్పనిసరి చేస్తూ ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థాన విచారణలను అనధికారికంగా రికార్డ్ చేయడం, ప్రసారం చేయడాన్ని తప్పుబట్టింది. సంబంధిత అధికారి ముందస్తు అనుమతి లేకుండా ఆడియో, వీడియో, ఫొటోలు, స్క్రీన్‌షాట్లు తీయడాన్ని నిషేధించింది. టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో కోర్టు విచారణలను లైవ్‌లో ఇవ్వడం, లేదా అప్‌లోడ్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తామని వెల్లడించింది. ఈ మేరకు న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు, సిబ్బందికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు (W.P. (Civil) No. 751 of 2026), ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను అందరూ పాటించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించినా, అనధికారికంగా ప్రసారం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
సీనరేజ్ కాంట్రాక్టుకు త్వరలో టెండర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News