రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉంచండి.. ప్రతీదానిపై సీబీఐ విచారణ కోరడం సముచితం కాదు: హైకోర్టు
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:12 PM
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటా కింద 1500 మంది అనర్హులకు సర్టిఫికెట్స్ ఇవ్వడంపై సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
అమరావతి, నవంబర్ 19: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటా కింద 1500 మంది అనర్హులకు సర్టిఫికెట్స్ ఇవ్వడంపై సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ప్రతి అంశంలోనూ సీబీఐ విచారణ కోరడం సముచితం కాదని, ముందుగా రాష్ట్ర వ్యవస్థలపైన, పోలీసుల పైన నమ్మకం ఉంచాలని సూచించింది.
ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల కోటా కింద అనర్హులకు సర్టిఫికేట్ ఇవ్వడంపై.. రెవెన్యూ యంత్రాంగాన్ని ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. వారిపై అనుమానం ఉంటే ముందుగా రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ఎందుకు ఆశ్రయించలేదంటూ ఆరా తీసింది. ‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుంది. రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం ఉంచాలి. ప్రతి అంశంపై సీబీఐ విచారణ కోరడం సముచితం కాదు. దేశంలోని అత్యున్నత సంస్థను ఎస్‌హెచ్‌వో స్థాయికి దిగజార్చవద్దు’ అంటూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఈ కేసులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కర్నూలు, నంద్యాల, వైఎస్ కడప జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది.
పిటిషన్లు వేసిన కర్నూలుకు చెందిన ప్రతాప్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది శ్రావణ్ వీరి తరఫున వాదించారు. కాగా.. తప్పుడు సర్టిఫికెట్లపై టీచర్ ఉద్యోగాలు పొందారని అనుమానం ఉంటే.. జిల్లా స్థాయిలోని ‘టీచర్స్ సెలక్షన్ కమిటీ’కి ఫిర్యాదు చేయవచ్చని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. కాగా.. హైకోర్టు ఈ కేసు విచారణకు వారం రోజులకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దు: ఇంజినీర్లకు కేంద్రమంత్రి సూచన
సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్
For More TG News And Telugu News