స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:28 PM
స్వర్ణవార్డు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వర్ణ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న నాలుగు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 28: ప్రభుత్వం స్వర్ణ వార్డుల్లో పనిచేసే నాలుగు కాటగిరీల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనుంది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఈ మేరకు ప్రమోషన్ ఛానళ్ల కోసం జీఓ నంబర్ 244 జారీ చేసిందని ఆయన తెలిపారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు(గ్రేడ్-II), వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులకు ఈ ప్రమోషన్లు వర్తిస్తాయని మంత్రి తెలిపారు. ఈ ప్రమోషన్ల ద్వారా మొత్తం 3,260 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగు కాటగిరీలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు కల్పిస్తున్నామని.. అధికారుల కమిటీ సిఫార్సులు అందిన వెంటనే మిగిలిన కేటగిరీ ఉద్యోగుల సంబంధికత ప్రమోషన్లపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి...
రంగారెడ్డి జిల్లాలో జింక మాంసం పట్టివేత.. 8 మంది అరెస్ట్
ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై భారీ అప్పులు.. దంపతుల బలవన్మరణం
Read Latest AP News And Telugu News