Share News

రాష్ట్రంలో పెన్షన్ల పండగ జరుగుతోంది: ఎంపీ కేశినేని శివనాథ్

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:51 AM

విజయవాడలోని తూర్పు నియోజకవర్గం రెల్లి కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేదలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతోందన్నారు.

రాష్ట్రంలో పెన్షన్ల పండగ జరుగుతోంది: ఎంపీ కేశినేని శివనాథ్
ntr bharosa pension distributions in ap

విజయవాడ, అక్టోబర్ 1: ఈ రోజు(గురువారం)నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులకు కొత్త పింఛన్ల పంపిణీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలోని రెల్లికాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేదలకు పెన్షన్లను అందించారు.


ఈ సందర్భంగా కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో ‘ఎన్టీఆర్ భరోసా’ కింద కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గవర్నమెంట్ ఉద్యోగస్థులకు జీతాలు వచ్చినా రాకపోయినా, ప్రతినెల ఒకటో తేదీ ఉదయం 6 గంటలకల్లా పేదలకు పెన్షన్లు అందుతాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలోనే పేదలకు అత్యధిక పట్టాలు ఇచ్చామని.. పేదలను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి పట్టాలు అందించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన పశ్చిమగోదావరి ఎమ్మెల్యే

కూటమి అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని తప్పుడు ప్రచారం చేశారని.. అయితే తొలిరోజే 99% పెన్షన్లు పూర్తి చేసేలా ఉదయం నుంచి పనిచేస్తున్నామని పశ్చిమగోదావరి ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఈ మేరకు తణుకు పట్టణంలో 32వ వార్డ్‌లో ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ తిరిగి అర్హులకు పెన్షన్ సొమ్ము అందజేశారు.


కూటమి ప్రభుత్వమే మళ్లీ రావాలి: ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్

రాష్ట్రంలో ప్రతీనెల ఒకటో తేదీన పెన్షన్ల పండగ జరుగుతుందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. జగన్ హయాంలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలైన ఏషియన్ పేపర్‌మిల్స్, లూలూ, అదానీ డేటా వంటివి రాష్ట్రానికి వచ్చి.. వైసీపీ వారు ఆ కంపెనీల్లో వాటాలు కోరడంతో ఉండలేక పారిపోయాయని ఆరోపించారు. కానీ.. ఈ రోజు ఏపీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. ఐటీ రంగంలో అమెరికా తరువాత ఏపీనే సెకండ్ హోమ్‌గా మారిందని అజీజ్ అన్నారు. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంతోనే పెట్టుబడులు వస్తున్నాయని.. ఇదే నాయకత్వం రాష్ట్రంలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 11:48 AM