ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. 22 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 09:57 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. ఏకంగా 22 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 22 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది. పర్యాటకం, పాఠశాల విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, టీటీడీ, వీఎమ్ఆర్‌డీఏ, ఏపీ టూరిజం తదితర కీలక శాఖల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
ఎవరికి ఏ బాధ్యతలంటే.?
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రావత్ నియమితులమవ్వగా.. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్యామలరావు, రవాణా శాఖ కార్యదర్శిగా కోన శశిధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రానున్న గోదావరి పుష్కరాల కోసం సురేశ్ కుమార్, భరత్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించింది ప్రభుత్వం. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా ఎం.జయకృష్ణ, ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శివప్రసాద్ నియమితులయ్యారు.
ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే.. తేజ్ భరత్, బి.అనిల్ కుమార్ రెడ్డిలను కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని సూచించింది. పి.రవి సుభాష్‌కు ఎపీటీడీసీ ఎండీగా బాధ్యతలప్పగించింది. ఇక.. పురావస్తు శాఖ కమిషనర్‌గా ముత్యాలరాజు, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా చక్రధర్ బాబుకు అదనపు బాధ్యతలు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్‌గా అరుణ్ బాబు నియమితులయ్యారు. విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ కమిషనర్‌గా ప్రఖర్ జైన్, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రభల గోపీనాథ్, ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పద్మావతి నియమితులయ్యారు. అదేవిధంగా హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా హెప్సిబా రాణి, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బి.సునీల్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ భారీ స్థాయి ఐఏఎస్ బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పలు ముఖ్య శాఖలకు కొత్త అధికారులను నియమించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో మరింత సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి:
చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు
రాహుల్ ప్రచారం చేసినా.. అంత స్పందన ఎందుకు రాలేదు?: థరూర్