Share News

MPPS మిట్టకొడూర్‌లో RAISE 100వ గ్రంథాలయం.. విద్యార్థుల్లో పఠనాసక్తికి ఊతం

ABN , Publish Date - Sep 10 , 2026 | 08:58 PM

పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న RAISE కార్యక్రమం ఎంపీపీఎస్ మిట్టకొడూర్ పాఠశాలలో 100వ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసి మరో కీలక మైలురాయిని చేరుకుంది.

MPPS మిట్టకొడూర్‌లో RAISE 100వ గ్రంథాలయం.. విద్యార్థుల్లో పఠనాసక్తికి ఊతం

పరిగి, సెప్టెంబర్ 10: పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న RAISE(Reading and Academic Improvement through School Libraries and Education) కార్యక్రమం ఎంపీపీఎస్ మిట్టకొడూర్ పాఠశాలలో 100వ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసి మరో కీలక మైలురాయిని చేరుకుంది.


ఎస్ఆర్‌టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన్వీ కొడాలి జనవరి 2025లో ప్రారంభించిన RAISE, ఏడాదిన్నరలోనే 100 పాఠశాలలకు గ్రంథాలయ వనరులను అందించింది. వనరులు పరిమితంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు మించి చదివే అవకాశాలు తక్కువగా ఉండటాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. RAISE ద్వారా పాఠశాలల్లో ఉపయోగకరమైన గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం సహా విద్యార్థుల వయసు, ఆసక్తులకు అనుగుణంగా పుస్తకాలను ఎంపిక చేసి, వారు సులభంగా చదువుకునేలా పఠన ప్రదేశాలను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చులను తన్వీ కొడాలి స్వయంగా భరిస్తున్నారు.


'100వ గ్రంథాలయం RAISE ప్రయాణంలో ఓ ముఖ్యమైన మైలురాయి మాత్రమే. ఇది ముగింపు కాదు. మరిన్ని పాఠశాలలకు పఠన వనరులను చేరువ చేయడమే మా తదుపరి లక్ష్యం' అని తన్వీ కొడాలి తెలిపారు. RAISE కార్యక్రమం SDG 4 - నాణ్యమైన విద్య, SDG 10 - అసమానతల తగ్గింపు లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతోంది.

Parigi.jpeg


ఇవీ చదవండి:

బ్రిక్స్‌ సదస్సుకు ముందు భారత్-రష్యా మధ్య భారీ డీల్

ఆస్తి కోసం కొడుకు కుట్ర.. తల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరమన్న సుప్రీంకోర్టు

Updated Date - Sep 10 , 2026 | 09:05 PM