ఎవరబ్బ సొత్తని పాసుపుస్తకాలపై జగన్‌రెడ్డి తన ఫొటో వేయించుకున్నాడు..
ABN , Publish Date - May 05 , 2026 | 10:24 AM
వైసీపీ పాలనలో భూముల విషయంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో అన్నీ ఇబ్బందులే
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్
చెన్నేకొత్తపల్లి(అనంతపురం): వైసీపీ పాలనలో భూముల విషయంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఎవరబ్బ సొత్తని రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్‌రెడ్డి తన ఫొటో వేయించుకున్నాడని మండిపడ్డారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను సోమవారం ఆమె పంపిణీ చేశారు. చెన్నేకొత్తపల్లి పంచాయతీలో 11006, వెల్దురి 394, బ్రాహ్మణపల్లి 82 మంది పాసుపుస్తకాలు రాగా వాటిని రైతులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
కుట్టుమిషన్లు, సెల్‌ఫోన్ల పంపిణీ
వెలుగు ఆధ్వర్యంలో ఇన్‌ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సాహకారంతో 50 శాతం సబ్సిడీపై ఏర్పాటు చేసిన 500 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే పరిటాల సునీత లబ్ధిదారులైన మహిళలకు అందజేశారు. అలాగే చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల 80 మంది ఐకేపీ యానిమేటర్లకు సెల్‌ఫోన్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇన్‌ఫిన్స్ సంస్థ రాప్తాడు నియోజకవర్గంలో 8వేల మంది మహిళలకు 50శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లను అందజేస్తోందన్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 50 శాతం సబ్సిడీతో సైకిళ్లను పంపిణీ చేయడానికి కూడా ఈ సంస్థ ముందుకు వచ్చిందన్నారు.
అనంతరం మండలంలో ఐదుగురికి మంజూరైన రూ.2.90లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం సత్యనారాయణ, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీవో బాలకృష్ణుడు, మార్కెట్‌యార్డ్ చైర్మన్ సుధాకర్‌నాయుడు, సొసైటీ అధ్యక్షుడు నరసింహులు, గ్రామ స్వరాజ్ ఎండీ శైలేంద్ర, ఏపీఎం నాగేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి రంగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ, సీకేపల్లి, కనగానపల్లి మండల కన్వీనర్‌లు ముత్యాల్‌రెడ్డి, యాతం పోతలయ్య, దండు ఓబులేసు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..
తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి
Read Latest Telangana News and National News