Share News

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌కు టీడీపీ కూటమి అభ్యర్థిగా పి.ఎస్. మంజునాథ్ నామినేషన్

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:21 PM

హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా పి.ఎస్. మంజునాథ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నమ్మకమే బలమని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌కు టీడీపీ కూటమి అభ్యర్థిగా పి.ఎస్. మంజునాథ్ నామినేషన్
PS Manjunath Files Nomination for Hindupur Chairman

Hindupur municipal chairman nomination:శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పి.ఎస్. మంజునాథ్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, విజయం సాధించి తీరుతానని మంజునాథ్ ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు మధ్యాహ్నం 2:15 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మంజునాథ్ ర్యాలీగా బయలుదేరారు.

స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి చేరుకుని, ఎన్నికల అధికారులకు అధికారికంగా తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ.. హిందూపురం పట్టణాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 04:21 PM