Share News

మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:34 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి సవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం: మంత్రి సవిత
AP Minister Savitha

పెనుకొండ, మార్చి 09: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిండు అసెంబ్లీలో తల్లి లాంటి నారా భువనేశ్వరిని అవమానించారంటూ మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లికి, చిన్నాన్న కుమార్తెకు న్యాయం చేయని వ్యక్తి వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ఇంట్లో వారిని బజారు పాలు చేశారంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాడేపల్లి, పులివెందులలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, దారుణాలు అంతా చూశారన్నారు. మహిళా ద్రోహి సీఎం చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే మహిళలపై కూడా కేసులు పెట్టారంటూ సీఎంగా జగన్‌ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా మంత్రి సవిత తూర్పారబట్టారు. హిందువులు, మహిళలు, బీసీల అభివృద్ధి అంటే సరిపోదంటూ జగన్‌కు చురకలంటించారు. మీ హయాంలో జరిగిన అరాచకాలపై నివేదిక తయారు చేసి గవర్నర్‌కు ఇప్పటికే అందజేశామన్నారు.


రాయలసీమ సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని కుండ బద్దలు కొట్టారు. వారు రాయలసీమ ద్రోహులున్నారు. ఏ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ నాయకులు సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అయితే ప్రజలు, మహిళలు చాలా క్లారిటీగా ఉన్నారు. మహిళా సాధికారత గురించి ఆలోచించింది పూలే ఆ తర్వాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అని మంత్రి సబితా తెలిపారు.


ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు మాత్రమే మహిళా సాధికారత కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు. మహిళలకు అన్ని అంశాల్లో ప్రాధాన్యత కల్పించింది సీఎం చంద్రబాబేనని పేర్కొన్నారు. ప్రతి ఇంటా మహిళా ఎంటర్ ప్రెన్యూర్ రావాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక: రిటర్నింగ్ అధికారి

లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 05:00 PM