ప్రముఖ నటులు గిరిబాబు మృతిపై సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, ఇతర ప్రముఖులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 08:34 PM
ప్రముఖ నటులు గిరిబాబు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిబాబు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అమరావతి, నవంబర్ 14: ప్రముఖ నటుడు గిరిబాబు మరణంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రముఖ నటులు గిరిబాబు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గిరిబాబు గారు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎన్నో పాత్రలతో చక్కటి హాస్యం కూడా పండించారు. అంతేకాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. గిరిబాబు కుమారుడు.. నటుటు రఘుబాబు గారెకి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు: మంత్రి నారా లోకేశ్
ప్రముఖ తెలుగు సినీనటులు గిరిబాబు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో తనదైన నటనతో ఆయన తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటులు గిరిబాబు: హోంమంత్రి అనిత
తనదైన నటనతో దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకులను అలరించిన గిరిబాబు గారు మృతి చెందడం బాధాకరం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.
ఆయన మంచి నటులు మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా: నటులు నందమూరి బాలకృష్ణ
సీనియర్ నటులు, దర్శక నిర్మాత గిరిబాబు మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. నా కెరీర్ ప్రారంభంలోనే ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో ఆయనతో కలిసి నటించాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. గిరిబాబు మంచి నటులు మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. ఆయన లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గిరిబాబు తనయుడు రఘుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
ఇవి కూడా చదవండి...
ఏపీ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకం
Read Latest AP News And Telugu News