నకిలీ మద్యం దందా వెనుక వైసీపీ బడా లీడర్లు.?

ABN, Publish Date - Oct 07 , 2025 | 01:48 PM

నిజానికి ఐదేళ్ల కిందట వైసీపీ హయాంలోనే ఈ నకిలీ మకిలి మొదలైందని, తీగలాగితే తమ డొంకా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడుతున్నారు.

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ లింకులు బయటపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన మద్యం తయారీ కేంద్రం లీజు తీసుకున్నదే వైసీపీ నేత. ఇక... మరో అనుమానితుడు జయచంద్రారెడ్డి పేరుకే టీడీపీ నాయకుడు. ఆయన మనసంతా వైసీపీయే అనే వాదనలున్నాయి. నిజానికి ఐదేళ్ల కిందట వైసీపీ హయాంలోనే ఈ నకిలీ మకిలి మొదలైందని, తీగలాగితే తమ డొంకా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈ వ్యవహరంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నిందితులు ఎంతటివారైనా వదలొద్దు. కఠినచర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పింది.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Updated at - Oct 07 , 2025 | 01:48 PM