AP POLICE: ఏపీలో సీఐల పదోన్నతలపై ప్రాంతాల వివక్ష.. జాబితాపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల గుర్రు..!

ABN, Publish Date - Jan 02 , 2025 | 09:07 PM

AP POLICE: ఏపీలో సీఐల పదోన్నతుల్లో ప్రాంతాల మధ్య వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రేంజ్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను గోప్యంగా ఉంచి.. మరో రేంజ్‌లో లేని పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్నారనే వాదన తెరమీదకు వచ్చింది.

అమరావతి: ఏపీలో సీఐల పదోన్నతుల్లో ప్రాంతాల మధ్య వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రేంజ్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను గోప్యంగా ఉంచి.. మరో రేంజ్‌లో లేని పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్నారనే వాదన తెరమీదకు వచ్చింది. ఫలితంగా కర్నూల్ రేంజ్‌లో1996లో సబ్ ఇన్‌స్పెక్టర్లుగా నియమితులైన వారు ఇప్పటికీ సీఐలుగానే ఉన్నారు. ఈ తర్వాత బ్యాచ్ ఎస్‌ఐలది అదే పరిస్థితి. కానీ గుంటూరు రేంజ్‌లో మాత్రం 2003 బ్యాచ్ ఎస్‌ఐలు, సీఐల నుంచి డీఎస్పీల పదోన్నతి జాబితాలో చేరిపోయారు.


ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు రోస్టర్ జాబితాలో ముందుకు వచ్చారా.. అంటే కాదు..? గుంటూరు రేంజ్‌లో జనరల్ కేటాగిరీ సీఐలు, రాయలసీమ రేంజ్‌లో బీసీ అధికారులకన్న ముందు ఉన్నారు. ఏలూరు, విశాఖపట్నం రేంజ్‌లో ఉన్న పోస్టుల కన్నా అధికంగా చూపడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని రాయలసీయ సీఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతుల నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు తీసుకుని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని డీజీపీకి తెలియజేసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించనున్నారు. అప్పటికి తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో ఊరట...

కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..

ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 02 , 2025 | 10:10 PM