కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:47 AM
హైదరాబాద్: కొడిగుడ్డు కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు.. కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ధర రోజు రోజుకూ ఎగబాకుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు వాటిని కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని గుడ్డు ధర దాదాపు రూ. 8 చేరువలో ఉంది.
హైదరాబాద్: కొడిగుడ్డు కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు.. కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ధర రోజు రోజుకూ ఎగబాకుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు వాటిని కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని గుడ్డు ధర దాదాపు రూ. 8 చేరువలో ఉంది. ఇది కనీవినీ ఎరుగని రేటేనని చెప్పాలి. ధరల పెరుగుదలకు సవా లక్ష కారణాలు ఉన్నాయి. పైగా స్కూలు పిల్లలకు పెట్టే పౌష్టికాహారానికి కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతోంది. గుడ్డుధర పెరుగుదల ఎవరికి నష్టం.. ఎవరికి లాభం..
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో గుడ్డు ధర అమాంతంగా పెరిగడంతో ఇక గడ్డుకాలమే.. కాదు కాదు గుడ్డు కాలమేనని వినియోగదారులు అంటున్నారు. పెరిగిన గుడ్డు ధరలు పౌల్ట్రీ యజమానులకు ఆనందం నింపుతుంటే వినియోగదారులకు మాత్రం ఆగ్రహం తెప్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు రూ. 5 ఉండే కోడిగుడ్డు ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో రూ. 7 పైబడే ధర పలుకుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 02 , 2025 | 11:50 AM