ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు..

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:39 AM

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ సీఈవోపై జరిగిన దాడి దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. ఆదివారం రాత్రి రామా టాకీస్ ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. ఆదినారాయణ అతని స్నేహితుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ సీఈవోపై జరిగిన దాడి దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. ఆదివారం రాత్రి రామా టాకీస్ ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. ఆదినారాయణ అతని స్నేహితుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆదినారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ సెలూన్ షాపుకు వెళ్లిన ఆదినారాయణపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కాగా ఆదినారాయణ అనే వ్యక్తి ఏపీకి చెందినవారు. ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నేతల సహకారంతో ఆరిజిన్ డెయిరీ ఏర్పాటుకు ఆయన ప్రయత్నించారు. డెయిరీ కోసం రైతుల నుంచి భూములు సేకరించడం.. పశువులు, ఇతర సబ్సిడీల పేరిట డబ్బులు సేకరించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఆదినారాయణపై కేసులు నమోదయ్యాయి. రెండు మూడేళ్లుగా రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భూముల సేకరణ లావాదేవీల కోసం ఆదినారాయణ బెల్లంపల్లిలో ఉంటున్నారు. ఈ క్రమంలో అతని ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో ఆయన మాజీ ఎమ్మెల్యే, మరో నలుగురుపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు సీఎం చంద్రబాబు

ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..

అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం.. బస్సులు దగ్ధం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 02 , 2025 | 11:39 AM