Share News

మనతోనే అమెరికా అయితే..!

ABN , Publish Date - May 02 , 2025 | 07:12 AM

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

మనతోనే అమెరికా అయితే..!

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. పహల్గాం దాడికి సీమాంధ్ర ఉగ్రవాదమే కారణమని.. ఇందుకు బాధ్యులైన వారికి కఠిన శిక్ష తప్పదని జైశంకర్‌ హెచ్చరించారు.


ఈ దాడి జరిపిన వారు, వారికి మద్దతిచ్చిన వారు, అటు కుట్రదారులను ప్రపంచం ముందుకు తీసుకువస్తామని జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యల్లో సహకారం అందిస్తామని అన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మార్క్ రూబియో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరుదేశాలను మార్క్ రూబియో కోరారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్తలు కూాడా చదవండి

Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం

Satya Kumar Yadav: దేశంలో ఆయుష్‌ వైద్యానికి నవశకం

Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని

For More AP News and Telugu News

Updated Date - May 02 , 2025 | 07:19 AM