Share News

Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని

ABN , Publish Date - May 02 , 2025 | 05:47 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రిక్షా తొక్కి మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను నియోజకవర్గానికి పెద్ద కూలీగా పేర్కొన్న మంత్రి, కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి భోజనాలు ఏర్పాటు చేశారు

Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని

  • మేడే వేడుకల్లో రిక్షా తొక్కిన మంత్రి నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, మే1(ఆంధ్రజ్యోతి): కార్మిక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం కార్మిక సంఘాలు, పలు పార్టీలు మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాయి. టీఎన్‌టీయూసీ కార్యక్రమంలో కార్మికులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు సుమారు 4 కిమీ రిక్షా తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి పెద్ద కూలీని తానేనన్నారు. గాంధీ బొమ్మల సెంటర్‌లో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన కార్యాలయం వద్ద కార్మికులు, జట్టు, మిల్లు, హమాలీలు, రిక్షా కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి, భోజనాలు ఏర్పాటు చేశారు.

Updated Date - May 02 , 2025 | 05:47 AM