India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం
ABN, Publish Date - May 03 , 2025 | 08:25 AM
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీవోకే యంత్రాంగం అప్రమత్తం చేసింది.
రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వచేసుకోవాలని, వాస్తవ ఆధీన రేఖకు సమీపంలో ఉన్న పదమూడు నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామని పాకిస్తాన్ మంత్రులు చెబుతున్నారు. అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ నిధులను ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు సమాచారం.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వార్తలు కూడా చదవండి
Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం
Satya Kumar Yadav: దేశంలో ఆయుష్ వైద్యానికి నవశకం
Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని
For More AP News and Telugu News
Updated at - May 03 , 2025 | 08:32 AM