నేడు హైదరాబాద్‌లో శాంతివనానికి ఏపీ సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 15 , 2025 | 09:19 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లోని కన్హా శాంతివనానికి సోమవారం వెళ్లనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

హైదరాబాద్,డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లోని కన్హా శాంతివనానికి ఇవాళ(సోమవారం) వెళ్లనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. సమావేశం అనంతరం ఇవాళ మధ్యాహ్నం ఏపీకి బయలుదేరుతారు. రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సీఎం సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లిలో అమరజీవి ఆత్మార్పణ రోజు కార్యక్రమానికి హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

టాలీవుడ్ లో యూనిటీ లేదు..థమన్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ శివారు ఔషపూర్ లో దొంగల బీభత్సం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 15 , 2025 | 09:49 AM