CM Chandrababu Naidu: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..
ABN, Publish Date - Sep 29 , 2025 | 05:15 PM
అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 6 నెలల్లో అన్న ప్రసాద భవనం పూర్తి అవుతుందని పేర్కొన్నారు.
విజయవాడ: దుర్గమ్మ అమ్మవారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 6 నెలల్లో అన్న ప్రసాద భవనం పూర్తి అవుతుందని చెప్పారు. రూ.25 కోట్లతో 1500 మంది సామర్థ్యంతో అన్న ప్రసాద భవనం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.27 కోట్లతో 3 నెలల్లో ప్రసాదం తయారీ వసతులు పూర్తి చేస్తామని వివరించారు. రూ.5.5 కోట్లతో ప్రధాన ఆలయం దగ్గర పూజా మండపం నిర్మాణం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
Updated at - Sep 29 , 2025 | 05:15 PM