Share News

TG News: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కి ఎలాంటి అనుమతులు లేవు.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ

ABN , Publish Date - Jul 27 , 2025 | 08:52 PM

యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌లో అక్రమ సరోగసీ, పిల్లల అమ్మకపు రాకెట్‌ జరుగుతోందని సమాచారం అందడంతో శనివారం తాము దాడులు నిర్వహించామని.. అక్కడ ఆపరేషన్ థియేటర్ కనిపించిందని హైదరాబాద్ డీఎం అండ్ హెచ్ఓ వెంకట్ తెలిపారు. 2021లోనే డాక్టర్ నమ్రత ప్రాక్టీస్ లైసెన్స్ వ్యాలిడిటీ అయిపోయిందని గుర్తుచేశారు.

TG News: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కి ఎలాంటి అనుమతులు లేవు.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ
Illegal Surrogacy Scam

హైదరాబాద్: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌లో (Universal Srushti Fertility Center) అక్రమ సరోగసీ, పిల్లల అమ్మకపు రాకెట్‌ జరుగుతోందని సమాచారం అందడంతో నిన్న(శనివారం జులై26) తాము దాడులు నిర్వహించామని.. అక్కడ ఆపరేషన్ థియేటర్ కనిపించిందని హైదరాబాద్ డీఎం అండ్ హెచ్ఓ వెంకట్ (DMHO Venkat) తెలిపారు. 2021లోనే డాక్టర్ నమ్రత ప్రాక్టీస్ లైసెన్స్ వ్యాలిడిటీ అయిపోయిందని గుర్తుచేశారు. కోర్టులో కేసు నడుస్తోండటంతో డాక్టర్ నమ్రత లైసెన్స్ రెన్యూవల్ చేయలేదని అన్నారు. నైట్రస్ ఆక్సైడ్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో దొరికిందని వెల్లడించారు డీఎం అండ్ హెచ్ఓ వెంకట్.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డాక్టర్ నమ్రతకు ఎలాంటి లైసెన్స్ లేదని డీఎం అండ్ హెచ్ఓ వెంకట్ స్పష్టం చేశారు. ఆమెకి ప్రాక్టీస్ చేయడానికి కూడా అనుమతి లేదని చెప్పుకొచ్చారు. అస్సలు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను క్లినిక్ అనడానికి అక్కడ ఏ ఆధారం లేదని తేల్చిచెప్పారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో కేవలం 4 గంటలు మాత్రమే పేషంట్స్ ఉంటారని వివరించారు. ల్యాబ్ ఎక్యూప్‌మెంట్ అంత పక్కగా ఉందని.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఆ ల్యాబ్ ఎక్యూప్‌మెంట్ అంత సీజ్ చేశామని తెలిపారు. గతంలో కూడా అనేక లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారని.. అప్పుడు కూడా వాటిని సీజ్ చేసి వారిపైన కేసు నమోదు చేశామని డీఎం అండ్ హెచ్ఓ వెంకట్ పేర్కొన్నారు.


విశాఖపట్నం వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏమన్నారంటే..

అలాగే యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై విశాఖపట్నం వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్పందించారు. యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు 2023లోనే వ్యాలిడిటీ అయిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్‌కు ఏలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిన్న(శనివారం) పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని... ఈరోజు తమ అధికారులు ఆ సెంటర్‌ను పరిశీలించారని చెప్పారు. విశాఖపట్నంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌పై ఏలాంటి ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు. సరోగసీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుందని... వారు అనుమతిస్తే, సరోగసీ సాధ్యమని తెలిపారు. విశాఖలో రెండున్నర సంవత్సరాల్లో కేవలం రెండింటికీ మాత్రమే అనుమతులు ఇచ్చామని... ఏడు వరకు రిజెక్ట్ అయ్యాయని విశాఖపట్నం వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..

కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 09:09 PM