Share News

Telangana High Court: మా ఓపికను పరీక్షించొద్దు.. హైకోర్టు హెచ్చరిక..

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:59 PM

పిటిషనర్లను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే చివరి విచారణ కాదని.. అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని సూచించింది. తమ ఓపికను పరీక్షించకండంటూ పిటిషనర్లను ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించింది.

Telangana High Court: మా ఓపికను పరీక్షించొద్దు.. హైకోర్టు హెచ్చరిక..

పిటిషనర్లను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే చివరి విచారణ కాదని.. అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని సూచించింది. తమ ఓపికను పరీక్షించకండంటూ పిటిషనర్లను ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించింది. గంటలకొద్దీ ఒకే అంశం ప్రస్తావించి, తమ సమయాన్ని వృథా చేయొద్దని చెప్పింది.


ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్ల పై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పారు. జీఓ పై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. పిటిషనర్ లాయర్లు ఇన్నిగంటలు వాదనలు వినిపిస్తే.. మాకు అవకాశం వస్తుందా.. అంటూ ప్రశ్నించారు. కులగణన లెక్కలు ఫోర్జరీ అనుకుంటున్నారా.. వాస్తవాలు తెలియకుండా పిటిషనర్లు ఎలా మాట్లాడుతారని అన్నారు.


2018లో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదని, 2019లో EWS 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని అభిషేక్ మను సింఘ్వీ గుర్తు చేశారు. ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50% దాటి అదనంగా 10 %.. అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుందని చెప్పారు. బిల్లు గవర్నర్‌కు పంపి ఆరు నెలలు అవుతోందని, ఆరు నెలల పాటు గవర్నర్ ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అటు తిరస్కరించ లేదు, ఇటు ఆమోదించలేదని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మంత్రం వేస్తానంటూ.. యువతిని ముగ్గులోకి దించిన ఫేక్ బాబా

అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 03:59 PM