South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:50 AM
పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
- దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని(Cherlapalli- Barauni) (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు జనగామ, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్‌నగర్(Jangaon, Kazipet, Peddapalli, Mancherial, Sirpur Kagaznagar),

బల్లార్షా, చందాపోస్ట్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్పూర్(Raipur, Bilaspur), ఝర్సుగూడ, రూర్కెలా, రాంచీ, మూరి, బొకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, చిత్తరంజన్, మధుపూర్ స్టేషన్‌లలో ఆగుతాయని తెలిపారు. అలాగే అక్టోబరు 24న పోదనూర్ జంక్షన్- బరౌని జంక్షన్ (06187), 25న పోదనూర్ జంక్షన్- బరౌని జంక్షన్ (06193), 26న బరౌని- ఎర్నాకులం జంక్షన్( దక్షిణం)(06184), 27న బరౌని జంక్షన్ - పోదనూర్ జంక్షన్ (06188), 28న బరౌని జంక్షన్ - పోదనూర్ జంక్షన్(06194)ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు మరో ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News