Drug Party in Moinabad: తెలంగాణలో డ్రగ్స్ పార్టీ భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 07:53 AM
మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్‌మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ( Moinabad Drug Party)ని భగ్నం చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. ఇంటర్‌మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ పార్టీలో డ్రగ్స్ మద్యం, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెర్రీ వోక్స్ ఫార్మ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
డ్రగ్స్ పార్టీలో 14 మందికి పైగా యువతులు, 35 మందికి పైగా యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఫామ్‌హౌస్‌లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఉన్న 8 బాటిళ్ల మద్యాన్ని, డీజేని సీజ్ చేశారు పోలీసులు. పార్టీ నిర్వాహకుడు కిషన్‌తో పాటు మరో ఐదు మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్ హౌస్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి ఆన్‌లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి నుంచి రూ.1300లు తీసుకున్నాడు నిర్వాహకుడు కిషన్.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్‌కు నలుగురి పేర్లు!
Read Latest TG News And Telugu News