Share News

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:47 AM

Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Cyber criminals blackmail to MLA

నల్గొండ, మార్చి 5: సైబర్ నేరాగాళ్ల (Cyber Crime) ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. లేకపోతే వారిని బెదిరిస్తూ అందిన కాడికి సొమ్మును మూటగట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ కేటుగాళ్ల కన్ను ప్రజాప్రతినిధులపైన పడింది. ఏకంగా ఒక ఎమ్మెల్యేనే (Telangana MLA) బెదిరించారంటే వారు ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. కానీ సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు బెదరలేదు ఆ ఎమ్మెల్యే. దీంతో ఆ సైబర్ కేటుగాళ్లు చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ సైబర్ నేరగాళ్లు బెదిరించిన ఎమ్మెల్యే ఎవరు.. ఏమని బెదిరింపులకు పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం.


తెలంగాణలో సైబర్ నేరగాళ్లు బరితెగింపులకు పాల్పడ్డారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (Nakrekal MLA Vemula Veeresham) బెదిరించారు సైబర్‌ నేరగాళ్లు. ఆయనకు న్యూడ్ కాల్స్‌ చేసిన సైబర్ నేరగాళ్లు.. డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్లో నుంచి ఫోటోలను సేకరించి, స్క్రీన్ రికార్డును పర్సనల్ నెంబర్ వాట్సాప్‌కు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా.. అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలకు ఓ ఫోన్ కాల్ రాగా.. దాన్ని లిఫ్ట్‌ చేశారు. అది న్యూడ్ కాల్ కావడంతో వెంటనే కట్ చేశారు. అయితే అప్పటికే స్ట్రీన్‌ను రికార్డు చేసిన ఆ కేటుగాళ్లు... ఆ వీడియోను ఎమ్మెల్యేకు పంపి బెదిరింపులకు దిగారు. వాట్సప్ చాటింగ్ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు మెసేజ్ పంపారు. డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేశారు. ఆ కేటుగాళ్ల బెదిరింపులకు లొంగలేదు ఎమ్మెల్యే.

vemula-veeresham.jpg

Ayyanna Serious on Jagan: జగన్‌ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ క్లారిటీ


దీంతో మరింత రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. వీడియో బయటపెడతామని, కాంగ్రెస్ లీడర్లందరికీ పంపుతామని హెచ్చరించారు. వారి బెదిరింపులకు ఏ మాత్రం లొంగలేదు ఎమ్మెల్యే. ఎంత సేపటికీ ఎమ్మెల్యే నుంచి సమాధానం రాకపోవడంతో వాళ్లు అనుకన్నంత పని చేశారు. రికార్డు చేసిన వీడియోను అభిమానులు, అనుచరులకు పంపించారు సైబర్ నేరాగాళ్లు. తమకు వచ్చిన వీడియోను చూసి ఆశ్చర్యపోయిన అనుచరులు.. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యేకు తెలియజేశారు. దాంతో ఖంగుతున్న ఎమ్మెల్యే వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అయినే తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా..

Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 05 , 2025 | 11:47 AM