MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా..
ABN , Publish Date - Mar 05 , 2025 | 10:57 AM
Graduate MLC Elections: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించలేదు. మరి అభ్యర్థి విజయాన్ని అధికారులు ఎలా డిక్లేర్ చేస్తారు.. కీలక వివరాలు మీకోసం..

కరీంనగర్, ఫిబ్రవరి 05: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం అర్థరాత్రి లోపే తేలిపోతుందనుకున్న ఫలితం ఇంకా తేలలేదు. పైగా ఈ ఎన్నికల ఫలితం మరింత ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య హోరా హోరీ సాగుతోంది. అందరూ అనుకున్నట్లుగానే.. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి. అయితే, కోటా నిర్ధారణ ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి(75675 ఓట్లు) మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి(70565 ఓట్లు) ఉన్నారు. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ట(60419 ఓట్లు) ఉన్నారు.
మొదటి ప్రాధాన్య ఓట్లలో కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలిమినేషన్ పద్ధతి ప్రకారం రెండో ప్రాధాన్య ఓట్లను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ లెక్కించనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
టెన్షన్ టెన్షన్..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. తొలుత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గానీ, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గానీ గెలుస్తారని అంతా భావించారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్‌లోకి వచ్చేశారు. మొదటి ప్రాధాన్య ఓట్లు అధికశాతం అంజిరెడ్డికి పడటంతో.. ఆయన టాప్‌లోకి దూసుకొచ్చారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అంజిరెడ్డికి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా గెలుస్తారనుకున్న క్యాండిడేట్స్.. వెనుకబడిపోయారు.. ఊహించని వ్యక్తి ముందుకు దూసుకొచ్చారు. ఏది ఏమైనా.. తొలి ప్రాధాన్య ఓట్లతో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
తరువాత ఏంటి..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. అంజిరెడ్డి తొలి స్థానంలో, నరేందర్ రెడ్డి రెండో స్థానంలో, ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో అభ్యర్థి ఎన్నికను ఖరారు చేయనున్నారు అధికారులు. అంటే.. మూడో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేషన్ పద్ధతి ప్రకారం రెండో ప్రాధాన్య ఓట్లను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ లెక్కించనున్నారు. ఈ విధంగా అభ్యర్థి విజయాన్ని అధికారులు ప్రకటిస్తారు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు..
11 వ రౌండ్ ఫలితాలు(Last Round)
1.అంజిరెడ్డి - 4935
(11 రౌండ్లు కలిపి (75675)
2.నరేందర్ రెడ్డి- 4387
(11 రౌండ్లు కలిపి (70565)
3.ప్రసన్న హరికృష్ణ - 3473
(11 రౌండ్లు కలిపి (60419)
అన్ని బ్యాలెట్ బాక్స్ లలోని మొత్తం బ్యాలెట్ పేపర్లు - 2,52,029
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు - 2,23,343
మొత్తం చెల్లని ఓట్లు - 28,686
కోటా నిర్ధారణ ఓట్లు - 1,11,672
Also Read:
ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణమిదేనా..
శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..
For More Telangana News and Telugu News..