Sudarsan Reddy Cycle Journey: 22,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర
ABN , Publish Date - Sep 15 , 2025 | 10:03 AM
కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వెల్మ నర్సింహ రామాను జదాసన్(33) అలియాస్ సుదర్శన్‌రెడ్డి అనే యువకుడు దేశవ్యాప్తంగా సైకిల్‌పై 108 వైష్ణవ ఆలయాలను దర్శించు కున్నాడు.
సైకిల్‌పై 108 వైష్ణవ ఆలయాల సందర్శన
- 22,000 కిలోమీటర్లు చుట్టివచ్చిన కొడిమ్యాల భక్తుడు
కొడిమ్యాల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొడిమ్యాల (Kodimyala) మండల కేంద్రానికి చెందిన వెల్మ నర్సింహ రామాను జదాసన్(33) అలియాస్ సుదర్శన్‌రెడ్డి (Sudarsan Reddy) అనే యువకుడు దేశవ్యాప్తంగా సైకిల్‌పై 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నాడు. నర్సింహ రామానుజదాసన్ సైకిల్‌పై గత ఏడాది ఆగస్టు 23న సైకిల్‌పై యాత్ర ప్రారంభించి ఏడాది కాలంలో సైకిల్‌పై 22,000 కిలోమీటర్లు ప్రయాణించి వైష్ణవ ఆలయాల్లో (Vaishnav Temples) ప్రత్యేక పూజలు చేశాడు. మండల కేంద్రానికి చెందిన వైష్ణవ భక్తులైన వెల్మ మల్లారెడి-్డకాంతమ్మ దంపతుల చిన్న కుమారుడైన సుదర్శన్‌రెడ్డ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు.
చిన్నప్పటి నుంచి వైష్ణవ భక్తుడైన సుదర్శన్‌రెడ్డి రెండు సంవత్సరాల క్రితం చిన్న జీయర్‌స్వామి వద్ద ఉపదేశం పొంది తన పేరును వెల్మ నర్సింహ రామానుజదాసన్‌గా మార్చుకున్నాడు. అనంతరం సాత్విక ఆహారం భుజిస్తూ వైష్ణవ ఆలయాల దర్శనానికి సైకిల్‌పై బయలుదేరాడు. మొదట తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి, కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం, ముక్తీనాథ్, బద్రీనాథ్; తిరుపతి వేంకటేశ్వరస్వామి, అహోభిలం లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాలతో పాటు పలు విష్ణు దేవాలయాలను దర్శించుకున్నాడు. దేశంలోని 108ఆలయాలను దర్శించుకొని ఆదివారం కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామానికి చేరు కొని లక్ష్మీనర్సింహస్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఆదివారం రాత్రి బసచేసి సోమవారం సాయంత్రం కొడిమ్యాలకు రానున్నట్లు కుటంబసభ్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News