Rajaram Singh: రాతియుగపు పరిశోధకుడు రాజారామ్ సింగ్
ABN , Publish Date - Sep 15 , 2025 | 10:12 AM
రాతియుగపు ఆనవాళ్లను పరిశోధిస్తూ అంతర్జాతీయంగా ఎందరో పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచిన ప్రముఖ ఆర్కియాలజిస్టు ఠాకూర్ రాజారాంసింగ్(అమరభారతి) చరిత్రపుటల్లో నిలిచారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆయన న్యాయవాదిగా అందరికీ తెలుసు.
తన ఇంటినే మ్యూజియంగా మార్చిన చరిత్రకారుడు
నేడు ఠాకూర్ రాజారామ్ సింగ్ జయంతి..
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాతియుగపు ఆనవాళ్లను పరిశోధిస్తూ అంతర్జాతీయంగా ఎందరో పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచిన ప్రముఖ ఆర్కియాలజిస్టు ఠాకూర్ రాజారాంసింగ్(అమరభారతి) (Archaeologist Rajaram Singh) చరిత్రపుటల్లో నిలిచారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆయన న్యాయవాదిగా అందరికీ తెలుసు. ఆర్కియాలజిలో అద్భుతాలు సాధించి, దేశవిదేశాల రీసెర్చ్ స్కాలర్స్ మన్ననలు పొందారు. రాజారాంసింగ్ 1928సెప్టెంబరు 15న పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని శివాలయం వీధిలో ఠాకూర్ నారాయణసింగ్, కృష్ణాబాయిలకు జన్మించారు.
కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడిగా రాణించారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ తిరస్కరించారు. అమరభారతి అనే కలం పేరుతో ఆంగ్లం, ఉర్డూ, తెలుగులో కవితలు, వ్యాసాలు రాశారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం సంపుటిని ఉర్డూ, ఆంగ్లంలోకి అనువదించారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాలను దాని నేపథ్యాన్ని శాతవాహనుల కాలంనాటి ఆనవాళ్లను, వారు ఉపయోగించిన పనిముట్లను పరిచయం చేశారు. గోదావరి పరివాహకం వెంట వెళ్లి రాతియుగం నాటి మనిషి ఆనవాళ్లు, పాదముద్రలను సేకరించారు. అలాగే రాకాసి బల్లి ఆనవాళ్లను మొదటిసారి సేకరించిన చరిత్రకారుడు. పెద్దబొంకూర్‌లో గల శాతవాహనుల చారిత్రక ఆనవాళ్లను నాణేలను సేకరించి ఆనాటిచరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి, ఆంగ్లంలో ఒక పుస్తకంగా మలిచిన మహనీయుడు.
పెద్దబొంకూర్‌లోను అలాగే కోటిలింగాలలోను ఆయన పరిశోధన మేరకు అక్కడ తవ్వకాలు జరిపారు. తన ఇంటినే మ్యూజియంగా మార్చాడు. ఎందరో పరిశోధకులకు మార్గదర్శిగా నిలి చాడు. కోటిలింగాల తవ్వకాల్లో బయటపడిన వాటిని, అనేక పనిముట్లను తన మ్యూజియంలో భద్రపరిచారు. పెద్దబొంకూర్ నాణాలను సేకరించి బౌద్ద జైనఆనవాళ్లను మన ముందుంచారు. ధూళికట్ట బౌద్దస్తూపం ప్రత్యేకతను వివరించారు. ఈయన రచనలను ఏసోర్స్ ఆఫ్ మెటీరి యలిజం అనే పేరుతో ఆంగ్లంలో ఒక పుస్తకంగా తీశారు.
ఆయన 2003జూలై 27న గుండెపోటుతో మరణించాడన్న వార్త సాహిత్యప్రపంచాన్ని కుదిపి వేసింది. ఆయన మరణవార్త సాహిత్య ప్రపంచాన్ని కుదిపివేసింది. ఎందరో పాశ్చాత్య ఆర్కియాలజిస్టులు ఇక్కడి చారిత్రక పరిశోధకుని ఇంటిని సందర్శించారు. మలయశ్రీ లాంటి మహానుభావులందరూ ఆయనతో ఉన్న పరిచయాలను ప్రజలకు సాహితీ ప్రపంచానికి వివరిస్తుంటే ఇంతటి గొప్ప మహనీ యుడు పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఉన్నారా అని అంటూ విస్తుపోయారు. ఇప్పుడు పెద్దపల్లి ప్రజల ముందున్న ఒకేఒక ప్రశ్న ఎల్లమ్మచెరువు ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిం చాలని, అలాగే పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఠాకూర్ రాజారాంసింగ్ మెమోరీయల్‌గా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన సేకరించిన ఆనవాళ్లను అందులో పొందుపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News