Share News

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

ABN , Publish Date - Mar 14 , 2025 | 07:59 AM

ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

హైదరాబాద్‌ సిటీ: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తక్షణమే స్పందిస్తున్నారు. గురువారం అల్వాల్‌ మండలంలోని తిరుమలగిరి గ్రామం లోతుకుంటలో రంగనాథ్‌ పర్యటించారు. ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై అక్కడి వెళ్లి వివరాలు సేకరించారు. కంటోన్మెంట్‌(Cantonment) ప్రాంతంలో ఉన్న ఈ స్థలం జనరల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కింద నమోదుకాగా, కొందరు ప్రైవేటు వ్యక్తులు తమదని పేర్కొంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నెలరోజులపాటు కిడ్నీ ఉచిత స్క్రీనింగ్..


అయితే, వంద ఎకరాలకు పైగా ఈ భూమిలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వరాదని కమిషనర్‌ అధికారులకు సూచించారు. అనంతరం అక్కడి నుంచి గండిమైసమ్మ మండలం దుండిగల్‌ విలేజీ(Dundigal Village)లోని బుబ్బఖాన్‌ చెరువు దిగువున ఉన్న లింగం చెరువు కాలువ పరిసరాలను, హఫీజ్‌పేట దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాను ఆయన పరిశీలించారు. హఫీజ్‌పేటలో టీడీఆర్‌ కింద లబ్ధిపొంది ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

city3.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 07:59 AM