Share News

Hyderabad: నెలరోజులపాటు కిడ్నీ ఉచిత స్క్రీనింగ్..

ABN , Publish Date - Mar 14 , 2025 | 07:32 AM

నెలరోజులపాటు కిడ్నీ ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలియేటివ్‌ కేర్‌ అందించేందుకుగానూ సమగ్ర చర్యలు తీసుకోవడం, కిడ్నీ వ్యాధుల నివారణ వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ ఎ. నరేంద్రకుమార్‌ తెలిపారు.

Hyderabad: నెలరోజులపాటు కిడ్నీ ఉచిత స్క్రీనింగ్..

- పాలియేటివ్‌ కేర్‌పై దృష్టి

- డీఎంఈ డాక్టర్‌ నరేంద్రకుమార్‌

- ఏఐఎన్‌యూలో కిడ్నీ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ: దీర్ఘకాలికంగా మూత్రపిండాల జబ్బుతో (సీకేడీ) బాధపడుతున్న వారికి పాలియేటివ్‌ కేర్‌ అందించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడం, కిడ్నీ వ్యాధుల నివారణ వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ ఎ. నరేంద్రకుమార్‌(A. Narendra Kumar) తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ(ఏఐఎన్‌యూ) గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి పరీక్షలు నిర్వహించే వాహనాన్ని గురువారం ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎండీ, చీఫ్‌ యూరాలజిస్టు డాక్టర్‌ సి.మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌యూరాలజిస్టు డాక్టర్‌ పూర్ణచంద్రారెడ్డి, సీఈఓ సందీప్‌ గూడూరుతో పాటు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..


ఈ సందర్భంగా డీఎంఈ నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులను త్వరగా గుర్తించి నయం చేసుకునేందుకు ఎప్పటికప్పడు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఏఐఎన్‌యూ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ యూరాలజిస్టు డాక్టర్‌ సి. మల్లికార్జున మాట్లాడుతూ రక్తపోటు (బీపీ), మూత్రంలో ప్రొటీన్‌, సీరం క్రియాటినైన్‌ వంటి పరీక్షలతోనే కిడ్నీ ఆరోగ్యం ఎలా ఉందన్న విషయం తెలిసిపోతుందని అన్నారు.


city2.2.jpg

ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీలను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా నెలరోజుల పాటు ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నామని, దాదాపు 10వేల నుంచి 15వేల మందికి పైగా మూడు పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ శిబిరాలకు వచ్చిన స్పందనను బట్టి, అవసరమైతే భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 07:32 AM