Ward Boy Misbehaves: హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:19 PM
చందానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినిపై అదే ఆస్పత్రిలోని వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఆర్కే హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిగా తెలుస్తోంది.
హైదరాబాద్, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): చందానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినిపై అదే ఆస్పత్రిలోని వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఆర్కే హాస్పిటల్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిగా తెలుస్తోంది.
హెచ్‌సీయూ విద్యార్థిని అనారోగ్య కారణాలతో చందానగర్‌లోని పీఆర్కే ఆస్పత్రిలో చేరారు. బాధిత విద్యార్థిని ప్రైవేట్ పార్ట్‌లను తాకుతూ ఆస్పత్రి వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌సీయూ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయాన్ని హాస్పిటల్ నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది గోప్యంగా ఉంచుతున్నారు. వార్డ్ బాయ్‌ని కఠినంగా శిక్షించాలని హెచ్‌సీయూ విద్యార్థిని డిమాండ్ చేశారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య
కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Read latest Telangana News And Telugu News