Share News

Kukatpally : కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య, కారకుడెవరు?

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:40 PM

కూకట్‌పల్లిలో ఘోరం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీస్‌లకు వెళ్లిన సమయంలో చిన్నారిని చంపేసి పరారయ్యారు.

Kukatpally : కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య, కారకుడెవరు?
Kukatpally 12 years Girl Murder

ఆగస్టు 18: కూకట్‌పల్లిలో ఘోరం జరిగింది. పన్నెండేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఆఫీస్‌లకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవికంగా చంపేసి పరారయ్యారు దుండగులు.

కూకట్‌పల్లి సంగీత్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో పన్నెండేళ్ల సహస్రాణి ను పొట్టనబెట్టుకున్నారు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు.


పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సహస్ర తల్లిదండ్రులు రేణుక, కృష్ణ ప్రైవేట్ ఉద్యోగులు. కొన్నాళ్లుగా కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగిందని తెలిపారు.

కాగా, చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విగతజీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉండి ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Kukatpally-Girl-Murder.jpgఇలా ఉండగా, బాలిక హత్యకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలికపై ఒక యువకుడు లైంగిక దాడికి యత్నించినట్టు అనుమానిస్తున్నారు. ఎదురు తిరిగిన బాలికను పొడిచి చంపినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్‌లో ఓ యువకుడు ఇంటి నుంచి బయటకి వస్తున్న దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

లేటెస్ట్ అప్డేట్ :

హైదరాబాద్: కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్పాట్ కు చేరుకున్నక్లూస్ టీం.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు సేకరించింది. ఒక్కడే వచ్చి బాలికను హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ అయింది. నిందితుడి కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ ఉదయం సహస్రాణి అనే 12 ఏళ్ల చిన్నారిని దుండగుడు కత్తితో పొడిచి చంపిన ఘటన అందర్నీ కలిచివేస్తోంది.

Kukatpally-girl-murder.jpg


ఇవి కూడా చదవండి..

డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..

చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..

Updated Date - Aug 18 , 2025 | 09:27 PM