Share News

Uttam Kumar Reddy: కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్..

ABN , Publish Date - Sep 29 , 2025 | 08:08 PM

ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించామని తెలిపారు.

Uttam Kumar Reddy: కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్..
Uttam Kumar Reddy

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ ఆల్మట్టి ప్రాజెక్టుపై చేసిన కామెంట్స్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రాజెక్టులపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ(సోమవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే ఉందని ఆయన గుర్తుచేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపుకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.


ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. కోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించామని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలో కాంగ్రెస్ హయంలోనే తెలంగాణకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందని ఆరోపించారు. కేటీఆర్ తన మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఢిల్లీకి మంత్రి ఉత్తమ్...

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 6:45 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉత్తమ్ కలువనున్నారు. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల పంట ప్రొక్యూర్ చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 52 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. మిగిలిన ధాన్యం ప్రొక్యూర్మెంట్‌కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాముల్లో, రైస్ మిల్లులో ధాన్యం నిండిపోయి ఉందన్నారు. ధాన్యం తలింపుకు 300 ట్రైన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తానని మంత్రి ఉత్తమ్ వివరించారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

Updated Date - Sep 29 , 2025 | 10:08 PM