Bandi Sanjay: తెలంగాణ ఎనిమీ ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై దృష్టి : బండి సంజయ్
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:28 PM
దేశవ్యాప్తంగా 12,800 శత్రు ఆస్తులున్నాయని అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వివరించారు. 600లకుపైగా ఎనిమీ ప్రాపర్టీస్ వేలం దశలో ఉన్నాయని తెలిపారు. ఎనిమీ ప్రాపర్టీస్ వేలం ద్వారా సర్కార్‌కు రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కార్యాలయంలో పునరావాస విభాగం(FFR) సీనియర్ అధికారులు, ఇండియాలో శత్రు ఆస్తుల సంరక్షక(CEPI) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్లు, శత్రు ఆస్తుల ఆర్థికీకరణ, శరణార్థుల పునరావాసలపై అధికారులు కేంద్ర మంత్రికి సమగ్ర నివేదిక అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలని బండి సంజయ్ అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా 12,800 శత్రు ఆస్తులున్నాయని అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వివరించారు. 600లకుపైగా ఎనిమీ ప్రాపర్టీస్ వేలం దశలో ఉన్నాయని తెలిపారు. ఎనిమీ ప్రాపర్టీస్ వేలం ద్వారా సర్కార్‌కు రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. పెండింగ్ ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన అధికారులను బండి సంజయ్ అభినందించారు. ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ కేసులను పరిష్కరించి, శత్రు ఆస్తులపై తక్షణమే సర్వే చేయించాలని ఆయన అధికారులకు సూచించారు. తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న శత్రు ఆస్తుల(ఎనిమీ ప్రాపర్టీస్) సమస్యలను పరిష్కరించేందుకు సర్వేను వేగవంతం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు