Share News

Robbery:బాబోయ్ దొంగలు.. వరుస చోరీలతో భయం భయం

ABN , Publish Date - Feb 13 , 2025 | 08:45 AM

Robbery:హైదరాబాద్ నగరంలో దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హిమాయత్ నగర్‌లో ఓ బంగారం వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. భారీగా బంగారం, నగదు దోచుకెళ్లాడు. వ్యాపారి లబోదిబోమంటూ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలలం సృష్టించింది.

Robbery:బాబోయ్ దొంగలు.. వరుస చోరీలతో భయం భయం
Thief In Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. దుబాయ్‌లో జరుగుతున్న వివాహంలో పాల్గొనడానికి బంగారం వ్యాపారి కేడియా వెళ్లాడు. ఆయన ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత తాళం పగలగొట్టి ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడటంతో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నాడు. డబ్బులు, బంగారం ఆభరణాలను చోరీ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించాడు.


బంగారం వ్యాపారి కేడియా ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగలతో పాటు రూ. 50 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి మొత్తాన్ని పరిశీలించారు. ఎంత సొమ్ము చోరీకి గురైందనే వివరాలను నమోదు చేసుకున్నారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌తో వచ్చి తనిఖీలు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా వ్యాపారి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను హిమాయత్ నగర్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పు కట్టలేదని ఏం చేశారంటే..

ఉచితం.. అనుచితం

మృతదేహం జాడ దొరకలేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 09:05 AM