CBI: మృతదేహం జాడ దొరకలేదు!
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:06 AM
కేరళలోని పతనంతిట్ట జిల్లా కోడుమాన్‌కు చెందిన కె.శంకరన్ మిలటరీలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎస్‌ఐ స్థాయి అధికారిగా పనిచేసేవారు. 2023 ఆగస్టు 22న సెలవుపై ఇంటికి వచ్చారు.

రెండేళ్ల క్రితం గుర్తు తెలీని మృతదేహాన్ని పూడ్చిపెట్టిన పోలీసులు
రీ పోస్ట్‌మార్టం కోసం తాజాగా తవ్వకాలు
మట్టిలో కలిసిపోయిన మృతదేహం, కవర్
డీఎన్‌ఏ గుర్తించాలని కేరళ హైకోర్టు ఆదేశాలు.. కాకినాడ వచ్చిన సీబీఐ అధికారులు
కాకినాడ క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఓ సైనికాధికారి మృతదేహాన్ని గుర్తించేందుకు బుధవారం కాకినాడ వచ్చారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా కోడుమాన్‌కు చెందిన కె.శంకరన్ మిలటరీలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎస్‌ఐ స్థాయి అధికారిగా పనిచేసేవారు. 2023 ఆగస్టు 22న సెలవుపై ఇంటికి వచ్చారు. మరో 37 రోజులు సెలవు పొడిగించుకునేందుకు ఆ ఏడాది అక్టోబరు 19న తిరిగి డ్యూటీ వద్దకు వెళ్లారు. అనంతరం కేరళ పయనమై.. నవంబరు 25న అసోంలో గౌహతి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ విషయాన్ని అతడితో పాటు అతని పైఅధికారులు కూడా కుటుంబానికి తెలియజేశారు. అయితే 2023 నవంబరు 27వ తేదీన చెన్నై రైల్వేస్టేషన్ నుంచి శంకరన్ భార్య కుమారికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్‌లో.. ఎవరో ఓ వ్యక్తికి చెందిన లగేజీ బ్యాగ్ చెన్నై రైల్వేస్టేషన్ సమీపంలో పడిపోయిందని చెప్పాడు. అదేరోజు రాత్రి కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్‌లో రైలు నుంచి జారిపడి శంకరన్ చనిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతదేహాన్ని మూడు రోజుల పాటు కాకినాడ జీజీహెచ్ మార్చురీలో ఉంచి మృతుని వివరాల కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అనంతరం కాకినాడలోని విజ్జపురెడ్డి శ్మశానవాటికలో మృతదేహాన్ని పూడ్చిబెట్టారు. శంకరన్ కుమారుడు శ్రీజిత్ శంకరన్ ఫిర్యాదు మేరకు సైనికాధికారి అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించాలంటూ ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. 2024 డిసెంబరు 5వ తేదీ నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ నుంచి నలుగురు అధికారుల బృందం బుధవారం కాకినాడ వచ్చింది. కాకినాడ అర్బన్ ఎమ్మార్వో జితేంద్ర సమక్షంలో శంకరన్ డీఎన్‌ఏ కోసం తవ్వకాలు చేపట్టారు. అయితే పోలీస్ నివేదికలో మృతదేహం ఎరుపు, పసుపు రంగు కవర్‌లో చుట్టినట్లు ఉండగా.. తవ్విన ప్రాంతంలో ఆ కవర్ ఆనవాలు కానీ, మృతదేహం జాడ కానీ లభించలేదు. మృతదేహాన్ని పూడ్చిపెట్టి రెండేళ్లవడంతో మృతదేహంతోపాటు, కవర్ కూడా మట్టిలో కలిసిపోయినట్లు ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. దీంతో సీబీఐ అధికారులు అదే విషయాన్ని రికార్డు చేసుకున్నారు. త్వరలోనే కోర్టుకు నివేదిక ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News