MLC KAVITHA: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్..?
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:32 PM
కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత కామెంట్స్ తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యలో కవితపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే.. కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. దానితో పాటు బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను బీఆర్ఎస్ తొలగించింది.
అయితే కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత కామెంట్స్ తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో సమావేశం సమావేశమైనట్లు సమాచారం. కవిత కామెంట్స్‌పై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది. నేడో.. రేపో.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవిత విషయంలో మరో కోణం వెలుగు చూసింది. కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పార్టీకి కవిత రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగానే కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తలు కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత డ్రామాకి బీఆర్ఎస్ ఏ ముగింపు పలుకునుందో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది: సుదర్శన్ రెడ్డి
BJP మిత్రపక్షం BRS అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచ్చుకోండి : సామా