Singareni Bonus: దసరా కానుక.. నేడు అకౌంట్‌లో డబ్బులు జమ..
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:30 AM
సింగరేణి నుంచి వచ్చిన రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పంచానుంది. దసరా కానుకతో పాటు మరో కానుకను కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా.. లాభాల్లో 34 శాతం బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఒకో కార్మికుడికి రూ. 1,95,610 ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. దీంతో కార్మికుల ఖాతాల్లో మొత్తంగా రూ.819 కోట్లు పడనున్నాయి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 5500 ప్రభుత్వం అందజేయనుంది.
సింగరేణి నుంచి వచ్చిన రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దసరా కానుకతో పాటు మరో కానుకను కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దసరా లాగానే దీపావళికి కూడా కార్మికులకు లాభాల్లో వాటాను పంచుతామని స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది సింగరేణి కార్మికులు డబుల్ ధమాకా సంబరాలు జరుపుకోనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు