Telangana Police Key Decision in Kukatpally Girl Case: కూకట్ పల్లి బాలిక హత్య కేసులో పోలీసుల సంచలన నిర్ణయం
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:20 AM
కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో తెలంగాణ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులోని నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ను పోలీసులు జోడించనున్నారు. క్రిమినల్ అవ్వాలనే మైనర్ బాలుడు గోల్‌గా పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో (Kukatpally Girl Case) తెలంగాణ పోలీసులు (Telangana Police) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులోని నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ను పోలీసులు జోడించనున్నారు. క్రిమినల్ అవ్వాలనే మైనర్ బాలుడు గోల్‌గా పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
క్రైమ్ సిరీస్ చూసి సదరు బాలుడు క్రిమినల్ అవ్వాలనుకున్నారని పోలీసులు వెల్లడించారు. బాలుడు ఫోన్ మొత్తం యూట్యూబ్‌లో సీఐడీ సిరీస్ ఎపిసోడ్‌లే ఉన్నాయని పోలీసులు వివరించారు. బాలుడు రాసుకున్న లెటర్‌కు, బాలిక హత్యకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రెండు నెలల క్రితం ఏదో ఒక ఇంట్లో చోరీ చేసి ప్లాన్ అమలు చేయాలనే బాలుడు లెటర్ రాసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఏం జరిగిందంటే..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read latest Telangana News And Telugu News